బుధవారం 02 డిసెంబర్ 2020
Jangaon - Oct 22, 2020 , 02:03:48

పేదల అభ్యున్నతికి కృషి

పేదల అభ్యున్నతికి కృషి

  • రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ  శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌
  • ఏరియా దవాఖానలో రూ. 68 లక్షలతో  కొవిడ్‌ బ్లాక్‌కు శంకుస్థాపన

మహబూబాబాద్‌ టౌన్‌/మహబూబాబాద్‌ రూరల్‌: పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బుధవారం స్థానిక ఏరియా దవాఖానలో ఎంపీ మాలోత్‌ కవిత, కలె క్టర్‌ వీపీ గౌతమ్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ బిందు, ఎమ్మె ల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌తో కలిసి రెండు అంబు లెన్సులు ప్రారంభించారు. అనంతరం రూ. 68 లక్షలతో చేపట్టనున్న కొవిడ్‌ బ్లాక్‌కు, సిగ్నల్‌ కాలనీలో రూ. కోటితో నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ బ్లాక్‌ లో అన్ని హంగులతో, సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కరోనా నియంత్రణలో కృషి చేసిన వారిని అభినందించా రు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

సమీకృత మోడల్‌ మార్కెట్‌ నిర్మించేందు కు కృషి చేస్తామని, నిరుపేదలకు ఇ బ్బంది కలుగకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును పొడిగించామన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దన్నారు. జిల్లా కేంద్రంలో జర్నలిస్టు కొడుకును దుండగులు కిడ్నాప్‌ చేశారని, వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, బాలుడి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌, డీసీహెచ్‌ఎస్‌ భీమ్‌సాగర్‌, ఆర్డీవో కొమురయ్య, డాక్టర్లు రమేశ్‌, సతీశ్‌, సూర్యకుమారి, స్రవంతి, ఎస్‌యూవో వడ్డెబోయిన శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ కాంతేశ్వర్‌రావు, డీఈ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్‌, గంగాధర్‌, లునావత్‌ అశోక్‌నాయక్‌, తేళ్ల శ్రీను, రఘు, కౌన్సిలర్లు గంగాధర్‌, స్వాతి, శంకర్‌ పాల్గొన్నారు.

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌ ప్రారంభం   

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే  శంకర్‌ నా యక్‌ తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ ను జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, ఎంపీ కవితతో కలిసి మంత్రి స త్యవతి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయం గా ఎమ్మెల్యే అంబులెన్స్‌  డ్రైవింగ్‌ చేసి ఏరియా దవాఖాన వరకు తీసుకువెళ్లి సిబ్బందికి అప్పగించారు.