ఆదివారం 29 నవంబర్ 2020
Jangaon - Oct 22, 2020 , 02:03:46

లలితాత్రిపుర సుందరిగా దుర్గామాత

లలితాత్రిపుర సుందరిగా దుర్గామాత

  • వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

పాలకుర్తి, అక్టోబర్‌ 21 : దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గామాత బుధవారం లలితాత్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అమ్మవారికి కుంకుమ పూజలతోపాటు చండీహోమం నిర్వహించారు. శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శాంతినగర్‌, గౌడకాలనీతోపాటు పలు గ్రామాల్లోయువజన సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారి మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షుడు, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, అర్చకుడు మణికంఠశర్మ, అధ్యక్షుడు బండి రాజు, బండి కిరణ్‌కుమార్‌, కమ్మగాని సుధాకర్‌, బండి యాకన్న, కమ్మగాని శ్రావణ్‌కుమార్‌, ఇమ్మడి సురేశ్‌, చిట్యాల మధు, గజ్జి సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 దేవరుప్పులలో..

దేవరుప్పుల : దేవీనవరాత్రోత్సవాల సందర్బంగా మండలంలోని పెదమడూరు, కోలుకొండ గ్రామాల్లో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం పెదమడూరులో పురోహితుడు మోటకోడూరు శ్రీనివాసశర్మ ప్రత్యేక హోమం చేయగా దుబ్బ రాజశేఖర్‌- లక్ష్మీప్రసన్న దంపతులు ఈ హోమాన్ని నిర్వహించారు. అనంతరం సరస్వతి రూపంలో అమ్మవారు దర్శనమివ్వగా భక్తులు మొక్కులు చెల్లించారు. కోలుకొండలో సర్పంచ్‌ కూర్నాల రవి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు రమేశ్‌రెడ్డి, పెదగాని రాజు, ఆకవరం సాయి, పెదగాని సాయి, గొడిశాల మహేశ్‌ తది తరులు పాల్గొన్నారు.

రఘునాథపల్లిలో..

రఘునాథపల్లి : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మండల కేంద్రంలోని ఆరె క్షత్రియ భవనంలో ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం వేదపడింతులు రమణశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో జనగామ రూరల్‌ సీఐ బాలాజీ వరప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దుర్గామాతకు మొక్కులు చెల్లించి అన్నదానం చేశారు. సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అధ్యాత్మికతను అలవర్చుకుని సేవాభావంతో ముందుకెళ్లాలని కోరారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, కంచనపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ చీమలపాటి రవీందర్‌, ఆకుల మహేశ్‌, చీమలపాటి రామారావు, కోళ్ల రవిగౌడ్‌, రోహిత్‌, శ్రీనివాస్‌, రంగు రాజు, సాయిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జనగామ రూరల్‌లో..

జనగామ రూరల్‌ : మండలంలోని పలు గ్రామాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం పెంబర్తి గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూంకుమార్చన, అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణి చేశారు.