మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Oct 22, 2020 , 02:03:46

ప్రకృతిని ఆరాధించే సంస్కృతి తెలంగాణది

ప్రకృతిని ఆరాధించే సంస్కృతి తెలంగాణది

  • మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు
  • ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మడికొండలో బతుకమ్మ విగ్రహావిష్కరణ

మడికొండ, అక్టోబర్‌ 21: ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన తెలంగాణదేనని నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. మడికొండ మెట్టుగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి బుధవారం ఆయన ఆవిష్కరించారు. 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ తొట్ల రాజుయాదవ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బతుకమ్మ విగ్రహాలు స్థాపించడానికి సహకరించాలన్నారు. నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు.  విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. 23న జరిగే కౌన్సిల్‌ సమావేశంలో రూ.80లక్షలతో మెట్టుగుట్టకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జోరిక రమేశ్‌, లింగం మౌనికరెడ్డి, దర్గా సొసైటీ చైర్మన్‌ ఊకంటి వనంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, డీసీసీ జనగాం జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, నాయకులు ఆవాల రాధికారెడ్డి, బైరి కొమురయ్య, అల్లం శ్రీనివాసరావు, కుందూరు రాజేశ్‌రెడ్డి, పేపర్‌ రవి, వినోద్‌, నవీన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo