గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 21, 2020 , 01:56:21

లలితా త్రిపురసుందరిగా అమ్మవారు

లలితా త్రిపురసుందరిగా అమ్మవారు

నెహ్రూపార్క్‌, అక్టోబర్‌ 20 : జనగామ పట్టణంలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం బాలాజీనగర్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజారులు మాదాసు రాజేశ్‌ భార్గవ-లలిత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఉప్పలమ్మ సహిత ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించారు. పూజారి వారణాసి పవన్‌శర్మ, కౌన్సిలర్‌ మహంకాళీ హరిశ్చంద్రగుప్తా, ఆరుట్ల శోభాఅనంతరెడ్డి, లింగయ్య, ఆంజనేయులు, మార్గం రవి, వీరమల్ల చంద్రశేఖర్‌, దామోదర్‌ పాల్గొన్నారు.

పాలకుర్తిలో..

పాలకుర్తి : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో దేవీ నవరాత్రోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి మంగళవారం దుర్గామాత అమ్మవారు మంగళగౌరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శాంతినగర్‌, గౌడకాలనీ, గ్రామపంచాయతీ సమీపంలో అమ్మవారి విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, అర్చకుడు మణికంఠశర్మ, అధ్యక్షుడు బండి రాజు, బండి కిరణ్‌కుమార్‌, కమ్మగాని సుధాకర్‌, బండి యాకన్న, కమ్మగాని శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పెదమడూరులో ..

దేవరుప్పుల : మండలంలోని పెదమడూరులో దేవీశరన్నవరాత్సోవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన దుబ్బ రాజశేఖర్‌- లక్ష్మీప్రసన్న దంపతులు దుర్గామాతా విగ్రహం ప్రతిష్ఠించారు. మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారికి పూజలు చేశారు. 

VIDEOS

logo