మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Oct 21, 2020 , 01:56:23

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

లింగాలఘనపురం, అక్టోబర్‌ 20 : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని వరంగల్‌ ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు అన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు పత్రాలను మంగళవారం ఆయన మండల సేకంద్రంలో సేకరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమ్మారావు మాట్లాడుతూ ప్రతి ఓటూ విలువైనదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా నాయకులు కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అభ్యర్థి విజయానికి దోహదపడుతాయని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు గుడి వంశీధర్‌రెడ్డి, శ్రీలత, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ గవ్వల మల్లేశం, ‘దిశ’ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, గండి మంగమ్మ యాదగిరి, బోయిని రాజు, ఎడ్ల రాజు, కేమిడి కవితావెంకటేశ్‌, వేముల శ్రీనివాస్‌, కొత్తకొండ గంగాధర్‌, కంతి భాస్కర్‌, బోయిని యాకన్న, మబ్బు కరుణాకర్‌, రుషిగంపల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo