ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే

- ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 18 : ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని రైతుబంధు సమితి రాష్ట్ర అ ధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎ మ్మెల్యే డాక్టర్ రాజయ్య అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉన్నదని, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్నే గెలిపించాలన్నారు. ఓటు నమోదులో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం జిల్లాలో ముందుండాలన్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు, 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నదన్నారు. కరంట్ వినియోగంలో రాష్ట్రం ముందున్నదని, తలసరి ఆదాయంలో 14వ నుంచి 5 స్థానానికి చేరుకుందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఐటీ రంగంలో ఆరు సంవత్సరాల్లో 2లక్షల మంది ఉద్యోగాలు పొందారన్నారు. రా జకీయాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు వివరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంప త్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, జడ్పీటీసీలు, కూడా డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, మా ర్కెట్ చైర్మన్లు, ఎంపీపీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్‌గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర