శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 18, 2020 , 04:40:19

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

  •  ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైతువేదికలు 
  •  పీఆర్‌ఏఈ కిరణ్‌ కుమార్‌

కొడకండ్ల అక్టోబర్‌17: రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయమని పీఆర్‌ఏఈ కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం మండంలోని  రామవరం, కొడకండ్ల, ఏడునూతుల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశాల మేరకు మండలంలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మా ణం చివరిదశలో ఉన్నాయన్నారు. మూడు గ్రామాల్లో మాత్రం రైతువేదికలు  ప్రారంభానికి  సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  స ర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు పీ మధుసూదన్‌, మార్కెట్‌ డైరక్టర్‌ సతీశ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు  పాల్గొన్నారు. 

రైతును రాజు చేయడమే లక్ష్యం..

జనగామ రూరల్‌, అక్టోబర్‌17:  రైతును రాజు చేయడమే ప్రభు త్వ లక్ష్యమని ఎంపీపీ మేకల కలింగరాజు యాదవ్‌ పేర్కొన్నా రు. శనివారం మండలంలోని చీటాకోడుర్‌లో నిర్మిస్తున్న రైతువే దికను పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రైతులకు అధికారులు అందుబాటులో ఉండడం కోసమే రైతు వేదికలను ఏర్పాటు చేస్తుందన్నారు. త్వరలోనే రైతు వేదికలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొత్త దీపక్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్‌, కొమ్ము జగదీశ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 


VIDEOS

logo