శుక్రవారం 23 అక్టోబర్ 2020
Jangaon - Oct 17, 2020 , 02:36:46

బతుకమ్మ వేడుకల్లో గుంపులుగా వెళ్లొద్దు

బతుకమ్మ వేడుకల్లో గుంపులుగా వెళ్లొద్దు

  • టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి రూరల్‌, అక్టోబర్‌ 16 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతికైన బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలని, గుంపులుగా పాల్గొనొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన కరోనా బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. పరిమిత సంఖ్యలో బతుకమ్మ ఆడుకోవాలని మహిళలకు ఆయన సూచించారు. కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రస్తుతం వైరస్‌ తీవ్రత తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు.


logo