కిలోమీటరున్నర బీటీతో తగ్గనున్న దూరభారం

- రెండు మండలాలకు రవాణా సౌకర్యం
- ఆర్సీ పురం-కోడూరు రోడ్డును
- బీటీగా మార్చాలని స్థానికుల విజ్ఞప్తి
దేవరుప్పుల, అక్టోబర్ 16 : రెండు మండలాలను కలిపే దగ్గరిదారిది. కేవలం కిలోమీటరున్నర దూరమే ఉంది ఈ రహదారి. ఈ రోడ్డు ను బీటీ మారుస్తే దేవరుప్పుల, రఘునాథపల్లి మండలాలను కలిపే దగ్గరిదారవుతుందని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేవరుప్పుల మండలం రామచంద్రాపురం గ్రామం నుంచి రఘునాథపల్లి మం డలం కోడూరు మధ్య దూరం కిలోమీటరున్నర మాత్రమే. ఈ రహదారి ఇటు పాలకుర్తి, అటు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. దశాబ్దాలుగా ఈ రోడ్డు అభివృద్ధిపై అధికారులు నిర్తక్ష్యం వహించడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మట్టి రోడ్డు కావడంతో వర్షాలు కురిసినప్పుడు బురదమయమై వాహనచోదకులు వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డును బీటీగా మార్చితే రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
రహదారిని బీటీగా మార్చాలి..
గ్రామంలోని సగమంది రైతులకు సంబంధించిన భూముల ఈ దారిలోనే ఉన్నాయి. మట్టి రావడంతో వర్షాకాలంలో బురదవుతోంది. ఈ రోడ్డుపై నడవలేకపోతున్నాం. రామచంద్రాపురంతో పాటు కోలుకొండ, ఇతర తండాల గ్రామపంచాయతీల ప్రజలు వివిధ అవసరాలకు సమీపంలోని రఘునాథపల్లికి వెళ్తారు. ఎరువులు, విత్తనాల బస్తాలు ఈ దారిలోనే తేవాలి. వర్షాకాలంలో ఈ దారి నుంచి రాలేకపోతున్నాం. అందువల్ల రోడ్డును బీటీగా మార్చాలి.
- తోకల మల్లయ్య, రైతు, రామచంద్రాపురం
తాజావార్తలు
- నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు