గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 17, 2020 , 01:57:42

పండుగపూట విషాదం

పండుగపూట విషాదం

  • వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
  • విద్యుదాఘాతంతో మూడేళ్ల బాలుడు, వృద్ధురాలు, రోడ్డు ప్రమాదంలో విద్యార్థి..

బచ్చన్నపేట, అక్టోబర్‌ 16 : కరంటు షా క్‌ ఆ ఇంట్లో విషాదం మిగిల్చింది.  ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజు మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. మండలంలోని ఆలీంపూర్‌ గ్రామానికి చెందిన సిరిపాటి రమేశ్‌, మమత దంపతుల ఏకైక కుమారుడు రూబెన్‌పాల్‌ (3) ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. కాగా, పక్క ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు. ఓ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ వైరు ఒక చివరను స్తంభానికి కనెక్షన్‌ ఇచ్చి మరో చివరను మీటర్‌కు కనెక్షన్‌ ఇచ్చి వెళ్లాడు. కాగా, కొన్ని చోట్ల వైర్‌ ఫెయిల్‌ అయింది. ఈక్రమంలో బాలుడు ఆడుకుంటూ వైరును పట్టుకోవడంతో షా క్‌ తగిలింది. కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే ఆ బాలుడు మృతి చెందిన ట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, కరంటు అధికారుల నిర్లక్ష్యమే తన కుమారుడిని బలిగొందని తల్లిదండ్రులు రమేశ్‌, మమ త బోరున విలపించారు. సర్పంచ్‌ నరెడ్ల బా ల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ పర్వతం కవిత కు టుంబసభ్యులను పరామర్శించారు.

కాటారం : మండలంలోని ప్రతాపగిరి జీపీ పరిధిలోని మర్రిపల్లిలో విద్యుదాఘాతంతో వృద్ధురాలు ముక్కెర లక్ష్మి(60) మృతి చెందింది. ఎస్సై సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. భర్త స త్యం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. శుక్రవారం లక్ష్మి ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటూ పక్కనే ఉన్న ఫెన్సింగ్‌ను తాకింది. ఫెన్సింగ్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి ఎస్సై సాంబమూర్తి వెళ్లి వివరాలు సేకరించి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవపూర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించా రు. పేద కుటుంబం కావడంతో అంతిమ సం స్కారాలకు ఎస్సై ఆర్థికసాయం చేశారు. 

పుట్టిన రోజే ఆఖరి రోజు..

మట్టెవాడ : హన్మకొండ కాపువాడకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి కోల రాహుల్‌(18) రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు మట్టెవాడ సీఐ గణేశ్‌ తెలిపారు. శుక్రవారం రాహుల్‌ జన్మదినం కాగా గురువారం అర్ధరాత్రి కొత్తవాడలో ఉన్న మరో ఇద్దరు మిత్రులతో కలిసి పోచమ్మమైదాన్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గోపాలస్వామి గుడి సమీపంలో బైక్‌ డివైడర్‌కు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను దవాఖానకు తరలించగా మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బర్త్‌డే నాడే రాహుల్‌ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, సోదరి విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 


VIDEOS

logo