శనివారం 06 మార్చి 2021
Jangaon - Oct 16, 2020 , 06:56:21

కూలిన సర్వాయి పాపన్న కోట

కూలిన సర్వాయి పాపన్న కోట

 సందర్శించిన ఎమ్మెల్యే రాజయ్య

రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపురంలో 400 సంవత్సరాల క్రితం సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గురువారం కూలింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ నెర్రెలు బారి ఓ పక్క నేలమట్టమైంది. కోట కింద ఉన్న ప్రజలు ప్రమాదాన్ని  గుర్తించి ఇల్లు వదిలివెళ్లారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే డా క్టర్‌ తాటికొండ రా జయ్య గురువా రం హైదరాబాద్‌ నుంచి నేరుగా ఖిలాషాపురానికి చేరుకుని  కూలిన కోటను పరిశీలించి గ్రామస్తులను జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ సర్వాయి పాపన్న ఘన చరిత్ర ను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగా ణ తొలి ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట లో గణతంత్ర వేడుకలను నిర్వహించామని అన్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మ నందరిపై ఉందన్నారు. ఘటనలో ఇండ్లు కోల్పోయిన వారికి ఆ ర్థికసాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ హమీద్‌, తహసీల్దార్‌ బన్సీలాల్‌, సర్పంచ్‌ ముప్పిడి శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌, మహిళా విభా గం అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, నాయకులు నా మాల బుచ్చయ్య, జిట్టె వీరస్వామి, కావటి రాజయ్య, కుర్ర కమలాకర్‌, రాజేందర్‌ నాయక్‌, కొడిదెటి శంకర్‌, దూడల యాదగిరి, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, పురావస్తు శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

logo