శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Oct 16, 2020 , 06:56:21

రైతు వేదికల పనులు పూర్తి చేయాలి

రైతు వేదికల పనులు పూర్తి చేయాలి

జనగామ రూరల్‌/బచ్చన్నపేట/జఫర్‌గఢ్‌, అక్టోబర్‌15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా నూతనంగా గ్రామంలో రైతు వేదికలు నిర్మిస్తున్నదని, అందుకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులను అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌ రావు ఆదేశించారు. మండలంలోని వడ్లకొండ, చీటాకోడుర్‌ గ్రామాల్లో రైతు వేదికలు, ఆన్‌లైన్‌ ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారదస్వామి, కొత్త దీపక్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బచ్చన్నపేటలో రైతువేదిక నిర్మాణాన్ని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పరిశీలించారు. తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రఘురామకృష్ణ పాల్గొన్నారు. జఫర్‌గఢ్‌లో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక పనులను అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు వేదిక లను దసరా నాటికి పూర్తి చేసి, ప్రారంభించాలని తెలిపారు. జఫర్‌గడ్‌ గ్రామ పంచాయతీని సందర్శించి, ఇంటింటి ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు. నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జఫర్‌గఢ్‌ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో 12,929 నాన్‌ అగ్రికల్జర్‌ ఆస్తులు ఉండగా, దాదాపు ఇప్పటి వరకు 12వేల వరకు ఆస్తులను ఆన్‌లైన్‌ చేసినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీదర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


VIDEOS

logo