మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Oct 16, 2020 , 06:56:21

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

లింగాలఘనపురం, అక్టోబర్‌ 15: రాష్ట్రంలో ఏఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులదే గెలుపని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌ అధ్యక్షతన  గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారన్నారు.  ఈ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థికి భారీ మెజార్టీ ఖాయమన్నారు. దీని కోసం గ్రామాల్లో నియమించిన ఎన్నికల కోఆర్డినేటర్లు బాగా పని చేయాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఈమండలంలోనే ఎక్కువ నామినేటెడ్‌ పదవులున్నాయన్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల మండల అదనపు ఇన్‌చార్జిగా ఇక నుంచి నెల్లుట్ల రవీందర్‌రావు కూడా వ్యవహరిస్తారన్నారు. 

లింగాలఘనపురం చెరువులో పూజలు

లింగాలఘనపురంలోని పాత చెరువు మత్తడి పోస్తుండడంతో ఎమ్మెల్యే రాజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువుకు గోదావరి జలాలను చేరవేసే ప్రధాన కాలువకు ఆటంకాలు ఏర్పడితే గ్రామస్తుల విన్నపం మేరకు తాను సొంతంగా ప్రత్యామ్నాయ కాలువ కోసం జేసీబీని ఇప్పించడంతోపాటు, గ్రామస్తులకు సహకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని  వివరించారు. కార్యక్రమాల్లో కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, జడ్పీటీసీ గుడి వంశీదర్‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి ఉడుగుల భాగ్యలక్ష్మి, కార్యదర్శి గవ్వల మల్లేశం, విండో అధ్యక్షులు మల్గ శ్రీశైలం, బుషిగంపల ఉపేందర్‌గౌడ్‌, నాయకులు నెల్లుట్ల రవీందర్‌రావు, బోయిని రాజు, బస్వగాని శ్రీనివాస్‌గౌడ్‌, ఎడ్ల రాజు, దీకొండ శ్యామల, గండి మంగమ్మ యాదగిరి పాల్గొన్నారు. 

రిజర్వాయర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

నవాబుపేట రిజర్వాయర్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య, జనగామ కలెక్టర్‌ నిఖిల గురువారం వేర్వేరుగా సందర్శించారు. నవాబుపేట రిజర్వాయర్‌ మొదటి సారి మత్తడి పోస్తుండడంతో వారు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.


VIDEOS

logo