బుధవారం 03 మార్చి 2021
Jangaon - Oct 15, 2020 , 03:01:45

మత్తడిలో చేపల వేట..

మత్తడిలో చేపల వేట..

దేవరుప్పుల/దంతాలపల్లి : భారీ వర్షాలతో కడవెండి తాళ్ల చెరువు అలుగు ఉప్పొంగుతున్నది. దీంతో మత్తడి వద్ద కట్టిన వల తెగి చేపలన్నీ కిందికి పోతున్నాయి. విషయం తెలిసిన కడవెండితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపల వేటకు బుధవారం వందలాదిగా తరలివచ్చారు. వలలు, తోపెలతో బస్తాల కొద్ది చేపలు పట్టి పండుగ చేసుకున్నారు. కొర్రమీను మొదలు అన్ని రకాల చేపలు దొరకడంతో ఉమ్మడిగా పట్టి పంచుకున్నారు. చేపల వేట ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. అలాగే దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల, దంతాలపల్లి, పెద్దముప్పారం, దాట్ల, గున్నెలపల్లి, రేపోణి గ్రామాల్లోని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పెద్దముప్పారం వెళ్లే రోడ్డుపై నుంచి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా,  కుమ్మరికుంట్ల ఈనాకుంట చెరువు మత్తడిలో గ్రామస్తులు చేపలు పట్టారు. 

VIDEOS

logo