అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా

- రోడ్డు తెగి మధ్యలో చిక్కుకున్న లారీ..
- రాత్రంతా వరద నీటిలో ఇన్నోవా
- జనగామ జిల్లాలో ఘటనలు
- ప్రయాణికులను రక్షించినఅధికారులు, స్థానికులు
లింగాలఘనపురం, అక్టోబర్ 14 : మునుపెన్నడూ లేనివిధంగా జనగామ జి ల్లాను వానలు ముంచెత్తాయి. హైదరాబా ద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న వరంగ ల్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం అర్ధరాత్రి నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ స మీపంలో గోతిలో పడిపోయింది. డ్రైవర్, కండక్టర్ సహా 20 మంది ప్రయాణికులున్నారు. సమాచారం తెలుసుకున్న జనగా మ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్, ఎ స్సై దేవేందర్, నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపారాణి ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి 20 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్‌ను సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం వారిని వేరే బస్సులో తరలించారు. బస్సును ప్రొక్లెయి నర్ల సాయంతో అదే రాత్రి బయటికి తీసి జనగామ డిపోకు తరలించారు.
నెల్లుట్ల సమీపంలో దిగబడిన లారీ..
నెల్లుట్ల ఆర్టీసీ కాలనీలో రోడ్డు కొట్టుకుపోవడంతో లారీ దిగబడి పోయింది. జనగామ-నెల్లుట్ల రూట్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రోడ్డు తెగింది. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ నిఖిల, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సురేందర్, సర్పంచ్ చిట్ల స్వరూపారాణి, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు బుధవారం ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. క్రేన్ల స హాయంతో లారీని బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
జనగామ రూరల్ : వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోగా అందులో ప్ర యాణిస్తున్న వడ్లకొండ శివారు సుందర య్య నగర్‌కు చెందిన రెడ్డబోయిన నరేశ్, కనకరాజు, మరిగడికి చెందిన పుట్ట రవి, ఉట్నాల వెంకటేశ్ సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి నర్మెట నుంచి జనగామకు వెళ్తుండగా వడ్లకొండ పితిరి వాగు వరద ఉధృతిలో వాహనం కొట్టుకుపోయింది. 500 మీటర్ల దూరంలో తాటిచెట్టుకు తట్టుకుని అగింది. వెంటనే డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, సీఐ మల్లేశ్‌యాదవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం, గానుగుపహాడ్, వ డ్లకొండ గ్రామాల సర్పంచ్‌లు సానబోయి న శ్రీనివాస్, బొల్లం శారద, ఉప సర్పంచులు అనిల్, రవీందర్, రెండు గ్రామాల యువకులు తాడు సాయంతో సుమారు ఐదు గంటలు కష్టపడి నలుగురిని ఒడ్డుకు చేర్చారు. కాగా, పోలీసులు వద్దని వారిస్తు న్నా జనగామలో బిర్యానీ తినేందుకు ఇ న్నోవాలో వాగును దాటడానికి ప్రయత్నించిన నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్‌యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
- సెల్లార్లతో పాటు భవనాన్ని సీజ్ చెయ్యండి
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. మంత్రి తలసాని
- సంస్థాగత బలోపేతమే లక్ష్యం
- భక్తుల విశ్వాసానికి ప్రతీక
- పార్కు ఆధునీకరణకు ప్రణాళిక
- డిగ్రీ విద్యార్థికి ఎమ్మెల్సీ ఆర్థిక సహాయం
- పల్లె ప్రగతికి కృషి చేయాలి
- సభ్యత్వ నమోదుకు స్పందన
- 1.26 లక్షల ఉద్యోగాలు భర్తీ
- శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం పరామర్శ