మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Oct 06, 2020 , 04:42:00

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

పాలకుర్తి రూరల్‌: మండలంలోని చెన్నూరులో సోమవారం అనుమానాస్పద స్థితి లో మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చె న్నూరు గ్రామానికి చెందిన భద్రయ్య, వల్మిడికి చెందిన జోగు అనిత(31) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా భర్త, అతడి కుటుంబసభ్యుల తో అనితకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పంచాయితీ జరగ్గా, పెద్ద మనుషు లు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో సోమవారం అనిత అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది. కాగా తన బిడ్డను అల్లుడు, అత్తమామలు, బావ, కొట్టి చంపారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. అనిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్‌ తెలిపారు.


VIDEOS

logo