అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం

- ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్, అక్టోబర్ 4 : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాజయ్య పట్టభద్రులను కోరారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలో పట్టభద్రుల ఓట్లు 4,480 ఉండేవని, ప్రస్తుతం 10 వేల వరకు చేరే అవకాశముందని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు ఆసరా పింఛన్లతో పేదలను ఆదుకుంటున్న విషయాన్ని పట్టభద్రులకు వివరించాలని పార్టీ శ్రేణులను రాజయ్య కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పల్లెప్రగతి కార్యక్రమంలో శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, తడిపొడి చెత్త షెడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టామని వివరించారు. దీనిపై ప్రజలకు పార్టీ నేతలు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈసమావేశంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, కొమురవెళ్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ నాయకుడు గుడి వంశీధర్‌రెడ్డి, నాయకులు మహేందర్, గట్టు రమేశ్, చిలుపూరు దేవస్థాన చైర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సురేశ్‌కుమార్, పోకల శివన్న, ఉడుముల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
- బెంగాల్ పోరు : శివరాత్రి పర్వదినాన తృణమూల్ మేనిఫెస్టో విడుదల!
- ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ రాజీనామా
- షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
- దంచికొట్టిన స్మృతి మంధాన..భారత్ ఘన విజయం
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్‌బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!