శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 04, 2020 , 06:39:50

ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి

ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను  పూర్తి చేయాలి

జనగామ రూరల్‌, అక్టోబర్‌ 3 : గ్రామాల్లో ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అన్నారు. శనివారం మండలంలోని పసరమడ్ల గ్రామంలో ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పరిశీంచారు. ఈసందర్భంగా హమీద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఆస్తిని ఆన్‌లైన్‌లో పొందపర్చేందుకే సర్వే నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామాల్లో సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. 

ఇళ్ల వివరాలను పకడ్డందీగా నమోదు చేయాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రకియను పకడ్బందీగా నమో దు చేయాలని ఎంపీడీవో దేశగాని కుమారస్వామి అన్నా రు. మండల కేంద్రంలోని  పాతబస్టాండ్‌ జాతీయ రహదారి నుంచి శివునిపల్లి రైల్వేగేటు వరకు ప్రధాన రోడ్డుపై ఉన్న ఇళ్ల కొలతలను శనివారం ఆయన పరిశీలించారు. కుమారస్వామి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇళ్లు, ఇతర ఆస్తుల వివరాలను ఈ - ఈపంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమం లో గ్రామ పంచాయతీ ఈవో పున్నం శ్రీనివాస్‌, కారోబార్‌ సుమలత, సిబ్బంది పులి నర్సింహులు, అప్పాల రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo