శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 04, 2020 , 06:39:54

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

లింగాలఘనపురం, అక్టోబర్‌ 3 : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి విజయం ఖాయమని కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ అన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తును స్థానిక తహసిల్‌ కార్యాలయంలో డీటీ రాజేందర్‌కు శనివారం ఆయన అందించారు. సేవెల్లి సంపత్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రులంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్‌, ఇన్‌చార్జి ఉడుగుల భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం, నాయకులు బోయిని రాజు, ఉప్పల మధు, గట్టగల్ల శ్రీహరి, రామచంద్రం, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

నెహ్రూపార్క్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెళ్లి కృష్ణారెడ్డి అన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను శనివారం ఆయన పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. 


VIDEOS

logo