మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Oct 02, 2020 , 06:21:53

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ షురూ

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ షురూ

దేవరుప్పుల, అక్టోబర్‌ 1: పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఓటరు నమోదు పత్రాలను తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ రవీందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, మండల నాయకులు బస్వ మల్లేశ్‌, ఈదునూరి నర్సింహారెడ్డి, కారుపోతుల భిక్షపతి, కూతాటి నర్సింహులు పాల్గొన్నారు.

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఓటరు నమోదును పార్టీ రాష్ట్ర నాయకుడు ఉడుగుల రమేశ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, నాయకులు దొంతుల చంద్రమౌళి, రామకోటి,  రాజశేఖర్‌, మహేశ్‌, అంజయ్య,  రాములు, నాగరాజు, బాలకృష్ణారెడ్డి, యాకూబ్‌ పాల్గొన్నారు.

నమోదు పత్రాల పంపిణీ

జనగామరూరల్‌ : పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను ఎంపీపీ మేకల కలింగరాజు యాదవ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బండ లక్ష్మి వెంకటేశం గురువారం మండలంలోని ఎల్లంల, శామీర్‌పేట గ్రామాల్లో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాండ్ర రవికుమార్‌, మాజీ సర్పంచ్‌ బండ వెంకటేశం, సంపత్‌, బైరు శ్రీనివాస్‌, రమేశ్‌, ఉదయ్‌, బండ సంపత్‌,  మానేగల్ల రమేశ్‌, బీర్రు ఉదయ్‌, పరికిపళ్ల ఉపేందర్‌, దుబ్బాక ప్రసాద్‌, గనిపాక అనిల్‌, బనుక బాలరాజు, చెన్నోజు అశోక్‌, జిట్టె బాలకృష్ణ, నిమ్మల స్వామి, చాట్ల డానియల్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo