శనివారం 06 మార్చి 2021
Jangaon - Oct 02, 2020 , 06:21:51

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జనగామ క్రైం, అక్టోబర్‌ 01: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన మేకల ఆంజనేయులు (23) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక సెప్టెంబర్‌ 20వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆంజనేయులు పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి మేకల నర్సింహులు ఫిర్యాదు మేరకు ఎస్సై బీ రాజేశ్‌ నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌ యాదవ్‌ తెలిపారు.


VIDEOS

logo