గురువారం 04 మార్చి 2021
Jangaon - Oct 02, 2020 , 06:21:51

వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి

వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి

జనగామరూరల్‌/ బచ్చన్నపేట, అక్టోబర్‌ 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రకియ పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర పీఆర్‌ కమిషనర్‌ కే సుధాకర్‌ తెలిపారు. గురువారం జనగామ మండలంలోని శామీర్‌పేట, బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలోని ఆస్తుల వివరాలను ఈ-పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. దీనిపై కార్యదర్శి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీవొ రంగాచారి, ఎంపీపీ మేకల కలింగరాజు యాదవ్‌, డీఎల్‌పీవో గంగాభవాని, ఎంపీడీవో ఉప్పుగల్లు సంపత్‌ కుమార్‌, సర్పంచ్‌ మాండ్ర రవికుమార్‌, పంచాయతీ కార్యదర్శి ఇఫ్త్తికారుద్దీన్‌, కారోబార్‌ పాషా, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు డానియల్‌, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.  అదేవిధంగా చ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను ఎంపీడీవో రఘురామకృష్ణ పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 

దేవరుప్పులలో..

దేవరుప్పుల : ప్రజల ఆస్తులకు భద్రత, హక్కు కల్పించేందుకు చేపట్టిన ఇంటి స్థలాల ఆన్‌లైన్‌ ప్రకియ మండలంలో కొనసాగుతున్నది. కార్యదర్శులు, కారోబార్లు, జీపీ సిబ్బంది ఆయా గ్రామాల్లోని ఇంటి కొలతలు నమోదు చేస్తున్నారు.  


VIDEOS

logo