బుధవారం 03 మార్చి 2021
Jangaon - Oct 01, 2020 , 02:20:08

దారులన్నీ గులాబీమయం

దారులన్నీ గులాబీమయం

  • నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల ర్యాలీ    
  • గ్రామాల నుంచి జనగామకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

 జననగామరూరల్‌/బచ్చన్నపేట/నర్మెట/తరిగొప్పుల, సెప్టెంబర్‌ 30 : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు కదం తొక్కారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపు మేరకు బుధవారం ఊరూరు నుంచి వేలాదిగా తరలివెళ్లి జనగామ పట్టణంలో నిర్వహించిన భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. నర్మెట, బచ్చన్నపేట, జనగామ మండలాల్లోని గ్రామాల నుంచి ట్రాక్టర్లలో పెద్ద సంఖ్యలో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెళ్లారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. నర్మెట నుంచి బయల్దేరిన ట్రాక్టర్ల ర్యాలీని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్‌, ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, జడ్పీ కోప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మంకెన ఆగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నక్కల గట్టయ్య, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్‌రెడ్డి, నాయకులు ఇట్టబోయిన రమేశ్‌, కంతి రాజలింగం, జాల కిషన్‌, పిట్టల రాజు, బావండ్లపల్లి రాజు, కొన్నె చంద్రయ్య, బెడుదం సుధాకర్‌, ఆమెడపు కిరణ్‌రెడ్డి, నక్కల రవి, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు గడపురం శశిరత్‌, యూత్‌ అధ్యక్షుడు గోపగోని రామకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు. 

శామీర్‌పేట నుంచి భారీ ర్యాలీ

నర్మెట, బచ్చన్నపేట మండలాల నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు శామీర్‌పేట నుంచి జనగామ పట్టణానికి బయల్దేరారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చిన టీఆర్‌ఎస్‌ నేతలు డప్పుచప్పుళ్లతో ట్రాక్టర్లపై బయల్దేరగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. పెంబర్తి నుంచి జడ్పీటీసీ నిమ్మతి దీపిక ట్రాక్టర్‌ నడుపుతూ జనగామకు చేరుకున్నారు. శామీర్‌పేటలో ఎంపీపీ మేకల కలింగరాజు యాదవ్‌, వడ్లకొండలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారదాస్వామి, మిగితా గ్రామాల్లో పార్టీ గ్రామ అధ్యక్షులు ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభించి జనగామకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్‌, జిల్లా నాయకుడు బాల్దె సిద్దిలింగం, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అంబాల ఆంజనేయులు, సానబోయిన శ్రీనివాస్‌, బానోత్‌ జయరాం, ఎళ్ల సుజాత, మాండ్ర రవికుమార్‌, ఎర్ర సుజాత, మూల రవి, వివిధ గ్రామాల అధ్యక్షులు చినబోయిన నర్సయ్య, మడిపల్లి సుధాకర్‌గౌడ్‌, రైతు బంధు సమితి సభ్యులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

రైతులకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్‌

నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి భూమిపై రైతులకు పూర్తి భరోసా కల్పించిన మహానేత సీఎం కేసీఆర్‌ అని రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా జనగామలో నిర్వహించిన ర్యాలీకి మండలం నుంచి వందలాది ట్రాక్టర్లలో రైతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీపీ బావం డ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్‌, ఎంపీటీల ఫోరం అధ్యక్షులు గంగం సతీశ్‌రెడ్డి, దూడల కనకయ్య, వైస్‌ ఎంపీపీ అనిల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సంజీవరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మల్లారెడ్డి,  నరెడ్ల బాల్‌రెడ్డి, దివ్య, ఖలీల్‌, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌, సునీతారాజు, తార, మల్లేశం, రవీందర్‌రెడ్డి, కవిత, రాజనర్సు, బాలరాజు, ఆజీం, ఉపేందర్‌రెడ్డి, మధుప్రసాద్‌, తిరుపతి, సిద్ధిరాంరెడ్డి, సిద్ధ్దారెడ్డి, కిష్టయ్య,  సిద్ధిరాములు, బాలరాజు, ఆజాం, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తరిగొప్పుల నుంచి తరలిన శ్రేణులు

తరిగొప్పుల నుంచి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పింగిళి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీపీ జొన్నగోని హరిత, జడ్పీటీసీ  ముద్దసాని పద్మజ, వెం కట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ చెన్నూరి ప్రమీల, సర్పంచ్‌ దామెర ప్రభుదాస్‌, నాయకులు సుదర్శన్‌గౌడ్‌, సంజీవులు, చిలువేరి లింగం, రామరాజు నేతృత్వంలో కార్యకర్తలు తరలివెళ్లారు.

VIDEOS

logo