గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 01, 2020 , 02:20:08

‘సలాం హైదరాబాద్‌'లో లింగాలఘనపురంవాసి..

‘సలాం హైదరాబాద్‌'లో లింగాలఘనపురంవాసి..

  • నేడు విడుదల కానున్న సినిమా

లింగాలఘనపురం: సలాం హైదరాబాద్‌ సినిమాలో లింగాలఘనపురానికి చెందిన బోయిని ఎల్లేశ్‌ ఓ పాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమా గురువారం విడుదల కానుండడంతో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు. సినిమాలో వర్ధన్నపేటకు చెందిన రవీందర్‌ కథా నాయకుడుగా పరిచయం అవుతున్నారన్నారు. తాను ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నానన్నారు. లింగాలఘనపురం- బండ్లగూడెం గ్రామాల మధ్యనున్న బండ్లగుట్ట లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఇటీవల జరిగిన కార్య క్రమంలో ఆ స్వామి ఆశీస్సులు కోరుతూ సినిమా పోస్టర్‌ను విడుదల చేశామన్నారు. ఆన్‌లైన్‌లో గురువారం సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.  


VIDEOS

logo