మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Sep 29, 2020 , 06:57:53

గుట్కాలు విక్రయిస్తే రౌడీషీట్‌ నమోదు : ఎస్సై

గుట్కాలు విక్రయిస్తే రౌడీషీట్‌ నమోదు : ఎస్సై

బచ్చన్నపేట, సెప్టెంబర్‌ 28 : నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే సంబంధిత షాపుల యజమానులపై రౌడీషీట్‌ నమోదు చేస్తామని ఎస్సై రఘుపతి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రఘుపతి మాట్లాడుతూ గుట్కా విక్రయాలతో యువత చెడుదారిలో పయనిస్తోందన్నారు. అనేక మంది యువకులు నిండు నూరేళ్ల జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్కాలపై నిషేధం ఉన్నందున సహకరించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 


VIDEOS

logo