హైబ్రిడ్ పత్తి విత్తనాలను మూడేళ్లకుమించి పెట్టొద్దు

- వ్యవసాయ శాస్త్రవేత్త మధుశేఖర్
దేవరుప్పుల, సెప్టెంబర్ 28 : ఒకేరకం హైబ్రిడ్ పత్తి విత్తనాలను మూడేళ్లకు మించి సాగు చేయొద్దని యాదాద్రి భువనగిరి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త మధుశేఖర్ అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా వరి, పత్తి పంటలకు సస్యరక్షణ చర్యలపై మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవన్లో సోమవారం రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఈదునూరి నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో పాలకుర్తి డివిజన్ ఏడీఏ రాధిక, శాస్త్రవేత్తలు సారంగం పాల్గొన్నారు. మధుశేఖర్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా వానకాలంలో సాగుచేసిన వరి, పత్తి పంటలపై చీడపీడలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
హైబ్రిడ్ పత్తిని మూడు సంవత్సరాలు మాత్రమే సాగు చేయాలని, అనంతరం మరో రకాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తొలి దశలో కాండానికి రసాయనాలను చుక్కలుగా పెడితే చీడపీడలను అరికట్టవచ్చని మధుశేఖర్ తెలిపారు. వరి సాగులో లేత నారునే నాటేయాలని, సూక్ష్మధాతు లోపాల నివారణకు పోషకాలు చల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రామకృష్ణ, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ కారుపోతుల భిక్షపతి, ఏఈవోలు సాగర్, శ్రీకాం త్, రైతులు వెంకటేశ్వరశర్మ, దయాకర్, ధర్మారెడ్డి, కిష్టయ్య, అశోక్‌రెడ్డి, అంజ య్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు