ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Sep 28, 2020 , 06:25:04

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ఐనవోలు సెప్టెంబర్‌ 27 : అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నర్సింహారావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పున్నేల్‌ క్రాస్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామానికి చెందిన నిందితుడు సముద్రాల శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

VIDEOS

logo