మంగళవారం 20 అక్టోబర్ 2020
Jangaon - Sep 27, 2020 , 06:24:44

‘పల్లెప్రగతి’ పనుల్లో వేగం పెంచాలి

‘పల్లెప్రగతి’ పనుల్లో వేగం పెంచాలి

  • రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనుల్లో ఆలసత్వం వహించొద్దు
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి రూరల్‌/దేవరుప్పుల, సెప్టెంబర్‌ 26 : సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో నియోజక వర్గ అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష  నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అతిథి గృహంతో పాటు మిషన్‌ భగీరథ కార్యాలయానికి స్థల సేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నియోజక వర్గంలో డబుల్‌ రోడ్లు, పీఎంజీఎస్‌వై, సింగరేణి రోడ్లు మంజూరైనందున శంకుస్థాపనల తేదీలను ఖరారు చేయాలని కోరారు. మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరమని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పలు గ్రామాల బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, డీపీవో రంగాచారి, డీఆర్‌డీవో గూడూ రు రాంరెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ సంపత్‌రావు, శ్రీనివాస్‌, సంధ్యారాణి, తహసీల్దార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, ఎంపీడీవో ఆశోక్‌కుమార్‌, డాక్టర్‌ ప్రియాంక, టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, డీఈ జీవన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, ప్రధాన కార్యదర్శి బాలునాయక్‌, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌, పీఏసీఎస్‌ బ్యాంక్‌ చైర్మన్లు బొబ్బ ల ఆశోక్‌రెడ్డి, గోనె మైసిరెడ్డి, సర్పంచ్‌ వీరమనేని యా కాంతారావు, జడ్పీ, మం డల కో ఆప్షన్‌ సభ్యులు మదార్‌, ఎండీ సర్వర్‌ఖాన్‌,పాల్గొన్నారు.

పల్లెల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాల వల్ల పల్లెల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పులలోని తిరుమలా గార్డెన్‌లో శనివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. పెద్ద చదువులు చదివిన వారంతా పట్నాలకు వెళ్లి ఉపాధి అవకాశాలు చూసుకునేవారన్నారు. నేడు సాగునీరు పుష్కలంగా ఉండడంతో విద్యావంతులంతా గ్రామాలకు వస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. కరోనాతో కొన్ని నెలలుగా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, కుదుట పడితే విద్యావంతులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. కరోనా సమయంలో రూ. 2 లక్షల 70 వేల కోట్లను పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే, కేవలం రూ.40 వేల కోట్లు తెలంగాణకు ఇచ్చిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పింఛన్లకు రూ.12 వేల కోట్లు ఇస్తుంటే, కేంద్రం మాత్రం రూ.200 కోట్లు ఇచ్చిందన్నారు. ఈ లెక్కలను బీజేపీ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తున్నందున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు రూ. 6.18 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు తీగల దయాకర్‌ అధ్యక్షతన వహించగా, మండల నాయకులు పల్లా సుందరాంరెడ్డి, బస్వ మల్లేష్‌, సంజీవరెడ్డి, ఈదునూరి నర్సింహారెడ్డి, రమాదేవి, కోతి పద్మ, కృష్ణమూర్తి, సోమనర్సయ్య, భిక్షపతి, ఆకవరం నర్సింహారెడ్డి, జలేందర్‌రెడ్డి, చింత రవి, తీగల కొండయ్య, తోటకూరి రేణుక తదితరులు పాల్గొన్నారు.logo