సోమవారం 01 మార్చి 2021
Jangaon - Sep 26, 2020 , 03:48:07

పల్లెప్రకృతి వనాలు భేష్‌ : కలెక్టర్‌

పల్లెప్రకృతి వనాలు భేష్‌ : కలెక్టర్‌

బచ్చన్నపేట, సెప్టెంబర్‌ 25 : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాల ఏర్పాట్లు బాగున్నాయని జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు. మండల కేంద్రంతో పాటు గోపాల్‌నగర్‌లో శుక్రవారం పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, రైతువేదికలను ఆమె సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నిఖిల మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోందని వివరించారు.

వీటిని సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని నిఖిల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ సీఈవో వసంత, ఏపీడీ కొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రఘురామకృష్ణ, పీఆర్‌ఏఈ శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌లు మల్లారెడ్డి, పర్వతం మధుప్రసాద్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు షబ్బీర్‌ పాల్గొన్నారు.   


VIDEOS

logo