జనగామ జిల్లాలో ఏసీబీ సోదాలు

- అక్రమార్జన కేసులో చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి
- ఆయన బంధువుల ఇండ్లల్లో అధికారుల తనిఖీలు
లింగాలఘనపురం/రఘునాథపల్లి/బచ్చన్నపేట: సెప్టెంబరు 23: ఆదాయానికి మించిన ఆస్తు లు, అక్రమార్జన కేసులో హైదరాబాద్ మల్కాజిగి రి ఏసీపీ నర్సింహారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్క గా, జనగామ జిల్లాలోని మూడు మండలాల్లో ఆయన సమీప బంధువులు, సన్నిహితుల ఇండ్ల ల్లో బుధవారం అధికారులు సోదాలు నిర్వహించ డం కలకలం రేపింది. లింగాలఘనపురం మండ లం వడిచర్లలోని ఆయన మామ మోతె నర్సింహా రెడ్డి, రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలోని పోరె డ్డి తిరుపతిరెడ్డి ఇంట్లో, బచ్చన్నపేట మండలం కట్కూర్, వీఎస్ఆర్ నగర్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు.
గతంలో నర్సింహారెడ్డి స్నేహితుడితో తిరుపతిరెడ్డి సన్నిహి తంగా ఉంటూ హైదరాబాద్‌లో ఓ ఇంటి స్థలాన్ని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, సీఐ క్రాంతికుమార్ బృం దం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు దాడులు చేసి పలు కీలక డాక్యు మెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భం గా డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ ఏసీపీ నర్సింహా రెడ్డి ఏసీబీకి చిక్కడంతో జనగామ జిల్లాలోని మండలగూడెం, మాదారం, కుర్చపల్లి, క ట్కూరులో ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్ల ల్లో దాడులు చేశామన్నారు. వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆయన వివరించారు.
తాజావార్తలు
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన