గురువారం 29 అక్టోబర్ 2020
Jangaon - Sep 24, 2020 , 06:10:52

జనగామ సీఐ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హాక్‌

జనగామ సీఐ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హాక్‌

జనగామ క్రైం, సెప్టెంబర్‌ 23: ఇటీవల సైబర్‌ నేరగాళ్లు పోలీసుల ఫేస్‌బుక్‌ అకౌంట్లలోకి చొరబడి వారి స్నేహితులతో చాట్‌ చేసి డబ్బులు అవసరం ఉన్నాయంటూ ఫేక్‌ రెక్వెస్ట్‌లు పంపిస్తుండడం వెలుగు చూస్తున్నాయి. బుధవారం అదేకోవలో జనగామ అర్బన్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి సైబర్‌ నేరగాళ్లు చొరబడ్డారు. అందులో సీఐ తన స్నేహితుడితో చాట్‌ చేస్తూ రూ.20 వేలు అత్యవసరం ఉందని, రేపు ఇస్తానని సీఐ అడుగుతున్నట్లు ఉంది. అనుమానం వచ్చిన సదరు స్నేహితుడు ఫోన్‌ చేసి చెప్పగా సీఐ విస్మయానికి గురయ్యారు.

వెంటనే తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలని అడ్మిన్‌ను కోరినట్లు సీఐ తెలిపారు. ఫేక్‌ మెస్సేజ్‌లను నమ్మి ఎవరూ మోసపోవొద్దని సీఐ కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.logo