బుధవారం 28 అక్టోబర్ 2020
Jangaon - Sep 24, 2020 , 06:10:40

సర్జన్స్‌ అసోసియేషన్‌ స్టేట్‌ చాప్టర్‌ చైర్మన్‌గా రాజమౌళి

సర్జన్స్‌ అసోసియేషన్‌ స్టేట్‌ చాప్టర్‌ చైర్మన్‌గా రాజమౌళి

జనగామ టౌన్‌, సెప్టెంబర్‌ 23 : సర్జన్స్‌ అసోసి యేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర చాప్టర్‌ చైర్మన్‌గా జనగామకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చంద్రగిరి రాజమౌళి ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్‌ చాప్టర్‌ సమావేశంలో రాజమౌళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డాక్టర్‌ కనకరాజు తెలిపారు. రాజమౌళి మూడు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఐఎంఏ జనగామ అధ్యక్షుడిగా, నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ చైర్మన్‌గా, అంబేదర్‌ యువజన సంఘాల సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు.

రాజమౌళి సర్జన్స్‌ స్టేట్‌ చాప్టర్‌ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లవకుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గోపాల్‌రెడ్డి, నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌, లయన్స్‌క్లబ్‌ జిల్లా గవర్నర్‌ కన్నా పరశురాములు, పూర్వ గవర్నర్‌ కాసం అంజయ్య, రీజియన్‌ చైర్మన్‌ సంజీవరెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.భవిష్యత్‌లో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.logo