బుధవారం 28 అక్టోబర్ 2020
Jangaon - Sep 24, 2020 , 06:10:40

కేసీఆర్‌కు కృత‌జ్ఠ‌త‌తో...

కేసీఆర్‌కు కృత‌జ్ఠ‌త‌తో...

  •  కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతుల జేజేలు
  •  ఊరూరా వెల్లువెత్తుతున్న సంబురాలు
  • భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో 800 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
  •  దేవరుప్పులలో కాడెడ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు
  • ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
  • వేలాదిగా పాల్గొన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు
  •  కేంద్ర బిల్లులపై ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి రైతాంగం జేజేలు పలుకుతున్నది. తాతలు, తండ్రుల కాలం నుంచి పహాణీలు, పట్టా పాస్‌ పుస్తకాల కోసం రైతులు ఏండ్లకేండ్లు  పడ్డ కష్టాలను దూరం చేసిన సీఎం కేసీఆర్‌కు ఊరూవాడా ప్రణమిల్లుతున్నది. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో 800 ట్రాక్టర్లతో బుధవారం భారీ ర్యాలీ తీశారు. ఇటు జనగామ జిల్లా దేవరుప్పులలోనూ టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు ఎడ్లబండ్లు, కాడెడ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు చేపట్టారు. రెండు చోట్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. 

భూపాలపల్లి టౌన్‌/దేవరుప్పుల : కొత్త రెవెన్యూ చట్టానికి స్వాగతం పలుకుతూ రైతాంగం జేజేలు కొడుతోంది. తమ కష్టాలు తీర్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారంటూ హర్షంవ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతగా బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకేంద్రంతో పాటు జనగామ జిల్లా దేవరుప్పుల తెలంగాణ తల్లి సర్కిల్‌ వద్ద టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించగా, వందలాది ఎడ్లబండ్లు, కాడెడ్లు, ట్రాక్టర్లలో తీసిన ఊరేగింపుతో పండుగ వాతావరణం నెలకొంది. రెవెన్యూ చరిత్రలోనే లేనివిధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలతో పాటు సర్కారు తెచ్చిన కొత్త చట్టాన్ని ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్‌ జిందాబాద్‌, మంత్రి ఎర్రబెల్లి దయన్న జిందాబాద్‌ అంటూ నినదించారు.

సంబురాల్లో దేవరుప్పుల టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, ఎంపీపీ బస్వ సావిత్రి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ ఈదునూరి నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు భిక్షపతి, పెద్దారెడ్డి, లీనారెడ్డి, బిళ్ల యాదవరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ అనంత కృష్ణమూర్తి, డైరెక్టర్లు తాటిపల్లి మహేశ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు నక్క రమేశ్‌, జోగు సోమనర్సయ్య, మైదం జోగేశ్వర్‌, మాజీ ఎం పీపీ  కొల్లూరు సోమయ్య, సర్పంచ్‌ లు మలిపెద్ది శ్రీనివాసరెడ్డి, బిళ్ల అం జమ్మ, బానోత్‌ రాజన్న, గోపాల్‌దాస్‌ మల్లేశ్‌, మాడ శంకర్‌, రెడ్డిరాజుల రమేశ్‌, పార్టీ యూత్‌ మండల అధ్యక్షుడు చింత రవి, మండల కార్యదర్శి సంజీవరెడ్డి, మండల నాయకులు కోతి ప్రవీణ్‌, కూతాటి నర్సింహులు, జే రిపోతుల సాయిలు, తోటకూరి కిష్ట య్య, రాంసింగ్‌, తీగల సత్త య్య, మ డికొండ ఎల్లయ్య, తిరుమలేశ్‌, పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు తీగల కొం డయ్య, ఆవుల వీరన్న, మూల రవి, లింగాల సతీశ్‌, జోగుల అయిలయ్య, వంగాల చిరంజీవి, కొమ్ము సాయి, గుండె రమేశ్‌, రైతులు కొండయ్య, సత్తయ్య, సోమయ్య, బండ బక్క య్య, చింత యాదగిరి, కొండయ్య, వీరస్వామి, భిక్షమయ్య ఉన్నారు.


logo