గురువారం 29 అక్టోబర్ 2020
Jangaon - Sep 23, 2020 , 03:18:59

నిరుపేద యువతులకు వరం కల్యాణలక్ష్మి పథకం

నిరుపేద యువతులకు వరం కల్యాణలక్ష్మి పథకం

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ (చిలుపూరు), సెప్టెంబర్‌ 22 : నిరుపేద యువతుల వివాహానికి సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం వరమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చిలుపూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 123 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. రాజయ్య మాట్లాడుతూ కరోనా కష్టాలున్నా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతలేకుండా చర్యలు తీసుకుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని రీతిలో తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో రైతుబంధు, రైతబీమా పథకాలను కొనసాగిస్తున్నారని రాజయ్య చెప్పారు.  ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, ఎంపీపీ సరితాబాలరాజు, వైస్‌ ఎంపీపీ సరితానర్సింహ, తహసీల్దార్‌ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కంకటి రవీందర్‌, నియోజక వర్గ కో ఆర్డినేటర్‌ వలేందర్‌రెడ్డి, రంగు రమేశ్‌, కనకయ్య, రవిచంద్ర, హరీశ్‌, ఇస్త్రం వెంకటయ్య, పాల్గొన్నారు.