వడివడిగా పల్లెప్రకృతివనాలు

జనగామ రూరల్, సెపెబర్ 22 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రకృతి వనాలు వేగంగా పూర్తవుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యమే లక్ష్యంగా ఎకరం స్థలంలో పూలు, నిడనిచ్చే మొక్కలు నాటుతున్నారు. ఆక్సిజన్ అందించే ఆయుర్వేద మొక్కలను సైతం ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 281 గ్రామాలుండగా వీటిలో 274 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన గ్రామాల్లో స్థల సేకరణ చేస్తున్నారు. ఒక్కో పల్లెప్రకృతి వనానికి రూ.6 లక్షలు వెచ్చిస్తున్నారు. పట్టణ వాతావరణాన్ని తలపించేలా నిర్మిస్తున్న పల్లెప్రకృతి వనాల్లో ఇప్పటికే 26 పార్కుల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధం కావడం విశేషం. దేవరుప్పుల మండలంలో 17, స్టేషన్ ఘన్‌పూర్‌లో 7, జనగామ, జఫర్‌గఢ్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పూర్తయ్యాయి. హరితహారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను ప్రభుత్వం నాటిస్తున్నది. ఆరో విడుత హరితహారంలో పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పట్టణాలు, నగరాల్లో ఉండే పార్కులు ఇకపై గ్రామాల్లోనూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో పార్కులో నాలుగు వేల మొక్కలు
ఒక్కో పల్లెప్రకృతివనం(పార్కు)లో నాలుగు వేల మొక్కలు నాటాలని సర్కారు నిర్ణయించి ఇందుకనుగుణంగా ఆదేశాలిచ్చింది. వీటిలో నీడనిచ్చే, పండ్లనిచ్చే రకాలున్నాయి. నేరేడు, ఉసిరి, వెలగ, వేప, సీమ చింత, నెమలినార, ఈత, జీలుగ, సీతాఫలం, జామ, దానిమ్మ, మల్బరీ, అయుర్వేద మొక్కల్లో తంగేడు, పారిజాతం, తిప్పతీగ తదితర మొక్కలను నాటుతున్నారు. వీటితోపాటు పూల మొక్కలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు నుంచి వృద్ధుల వరకూ పార్కులో సేద తీరేలా నిర్మాణం చేపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పల్లెప్రకృతి వనాలు దోహదపడుతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వీటిలో నాటిన మొక్కలను సంరక్షించేలా ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వినియోగించనున్నారు. ఏడాది తర్వాత గ్రామపంచాయతీలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తుదిదశకు పల్లెప్రకృతి పనులు...
పల్లెప్రకృతి వనాల పనులు తుదిదశకు చేరుకున్నాయి. కలెక్టర్, గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. వనాల్లో రెండు వరుసల్లో నీడ, పండ్లనిచ్చే మొక్కలు నాటుతున్నారు. మరో వరుసలో గుబురుగా ఉండే పూల మొక్కలను పెంచుతూ చుట్టూ మట్టిరోడ్డును నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల దీర్ఘ చతురస్రాకారంలో, మరికొన్ని చోట్ల వృత్తాకారంలో ఉన్న స్థలాలను బట్టి పల్లెప్రకృతి వనాలను నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులోగా అత్యధిక పార్కులు పూర్తికానున్నాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!