మంగళవారం 20 అక్టోబర్ 2020
Jangaon - Sep 22, 2020 , 02:53:16

నెలాఖరులోగా రైతువేదికలను పూర్తి చేయాలి

నెలాఖరులోగా రైతువేదికలను పూర్తి చేయాలి

నెహ్రూపార్క్‌, సెప్టెంబర్‌ 21 : గ్రామాల్లో చేపట్టిన రైతువేదికల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో రైతువేదికలు, వైకుంఠధామాల నిర్మాణంపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. నిఖిల మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా రైతువేదికలు, వైకుంఠధామాలను పూర్తి చేయాలని కోరారు. పూర్తయిన వాటి వివరాలను ఎఫ్‌టీవోలో ఎంట్రీ చేయాలని సూచించారు. లేకుంటే నిర్మాణం పూర్తయినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. దేవరుప్పుల మండలం కోలుకొండలో రైతువేదిక నిర్మాణం పూర్తయిందని, మిగతా వాటిని ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్క్‌ ఏజెన్సీలు సహకరించకుంటే మరొకరికి పనులు అప్పగించాలని నిఖిల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ రఘువీరారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి డీఈలు శ్రీనివాస్‌, రాజ్‌గోపాల్‌, దిలీప్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.logo