జనగామ జలమయం

- జిల్లా కేంద్రంలో భారీ వర్షం
- అలుగుపోస్తున్న చెరువులు
- పలు కాలనీల్లో వరద ఉధృతి
జనగామ, సెప్టెంబర్ 21 : భారీ వర్షంతో జనగామ పట్టణం జలమయమైంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ 31.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రంగప్పచెరువు అలుగుపోస్తున్నది. వరద ఉధృతితో పట్టణంలోని పలు కాలనీలు వాగును తలపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవతో గత ఏడాది డిసెంబర్లో గోదావరి జలాలతో రంగప్పచెరువును నింపడంతో అప్పట్లో అలుగు పోసింది. అయితే ఈసారి దంచికొడుతున్న వానలతో నిండుకుండలా మారి మత్తడి పడుతోంది. వరద నీరంతా పట్టణంలోని శ్రీనగర్‌కాలనీ, కురుమవాడ, సెయింట్ మేరీస్ స్కూల్, జ్యోతినగర్ కాలనీల్లోకి చేరింది. మరోవైపు ఆయా కాలనీల మీదుగా వరదనీరు ప్రవహించడంతో హైదరాబాద్‌కు వెళ్లే హైవే దెబ్బతిన్నది. ఇదే అంశాన్ని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కాలనీల్లోని ప్రధాన రహదారులు, ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజల ఇబ్బందులు పడకుండా ఎమ్మెల్యే స్వయంగా రెండు రోజు లు దగ్గరు ండి మున్సిపల్ ఇంజినీ రింగ్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. యంత్రాల సాయం తో మురుగు కాల్వల్లో మట్టి, ఇసుక మేటలను తొలగించ డంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారమైంది. వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధు లు మంజూరు కోసం ప్రతిపా దిం చారు. ఈ నేపథ్యంలో తాజా గా ఆదివారం రాత్రి నుంచి సోమ వారం ఉదయం వరకూ కురిసిన భారీ వర్షంతో రంగప్ప చెరు వు మళ్లీ మత్తడి పడుతోంది. దీంతో పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, కురుమవాడ, జ్యోతినగర్ లోని పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయి హైవేకు గండిపడి భారీగా నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నది. ఇళ్లలోకి మత్తడి నీరు చేరడంతో కాలనీ వాసులు భయాం దోళన చెందుతు న్నారు. వరద నీటిని దిగువ భాగంలోకి మళ్లించేందుకు అధి కారులు ప్రయత్నా లు చేస్తున్నా రు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం రంగప్పచెరువు నిండి మత్త డి నీరు ఈ ప్రాంతం నుంచి నెల్లుట్ల చెరువులోకి వెళ్లేవని, అప్పటి వానలు మళ్లీ ఇప్పుడు చూస్తున్నా మని కాలనీవాసులు చెబుతున్నారు. రంగప్పచెరువు మత్తడి నీటితో కాలనీలు ముంపున కు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన మళ్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అలుగుపోస్తున్న పెంబర్తి పెద్ద చెరువు
జనగామ : మండలంలోని పెంబర్తి పెద్ద చెరువు అలుగుపోస్తున్నది. భారీ వర్షాలతో జలకళ సంతరించు కుంది. 12 సంవత్సరాల క్రితం అలుగుపోసిన ఈ చెరువు తాజా వర్షాలతో నిండుకుండలా మారింది. ఇప్పటికే ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాలతో గోదావరి జలాలను చెరువుకు తరలించారు. ప్రస్తుత వర్షాలతో అలుగు పోస్తుం డడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్‌కు 'చెక్'..నిరాశలో నితిన్
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న