మంగళవారం 20 అక్టోబర్ 2020
Jangaon - Sep 21, 2020 , 04:57:43

రైతు సంక్షేమ రాష్ట్రం తెలంగాణ

రైతు సంక్షేమ రాష్ట్రం తెలంగాణ

  • ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

వేలేరు, సెప్టెంబర్‌ 20 : రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వేలేరు మండల కేంద్రంలో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆగ్రోస్‌ రైతు సేవా ద్వితీయ కేంద్రాన్ని ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య ప్రారంభించగా ముఖ్యఅతిథిగా ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ..

రైతులకు అం దుబాటులో ఉండేలా ప్రతి మండల కేంద్రంలో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్నిప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి ఈ సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని  ఆయన అన్నారు.  ఆగ్రోస్‌ నిర్వాహకులు మండల రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించాలని, వ్యవసాయ పనిముట్లు, ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై  అందించాలన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలను అందించాలని సూచించారు. రైతులు ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. రైతును రాజు చేయాలని, లాభసాటి వ్యవసాయం ద్వారా అన్నదాతల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీలు చాడ సరిత, పిట్టల శ్రీలత, వైస్‌ ఎంపీపీ సంపత్‌, కుడా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్‌ బిల్లా యాదగిరి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి, జడ్పీ సీఈవో ప్రసూనారాణి, ఏవో పద్మ, ఎంపీడీవో రవీందర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గుజ్జుల రాంగోపాల్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు జానీ, ఎంపీటీసీలు సంధ్య, జ్యోతి, అధికార ప్రతినిధి జోగు ప్రసాద్‌, ఆగ్రోస్‌ నిర్వాహకుడు చాడ విజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ వేలేరు గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు  తదితరులు పాల్గొన్నారు. 


logo