ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Sep 21, 2020 , 04:57:43

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

జనగామ రూరల్‌, సెప్టెంబర్‌ 20 : ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ  పథకాలు నచ్చి వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఓబుల్‌కేశ్వాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ చేర్యాల రేణుక తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ జెండానే ప్రతి ఒక్కరికీ అండ అన్నారు. ప్రతి గ్రామంలోని చెరువు, కుంటకు గోదావరి జలాలు అందిస్తున్నామని, ప్రతి ఎకరాన్ని సాగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల కళింగరాజు యాదవ్‌, మండలాధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు బాల్దె సిద్దిలింగం, మాజీ సర్పంచ్‌ ధర్మ జయప్రకాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ మండల నాయకుడు అనిల్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo