శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Sep 20, 2020 , 06:30:01

ప్రతి నెలా 15లోపు సదరం క్యాంపులు నిర్వహించాలి

ప్రతి నెలా 15లోపు సదరం క్యాంపులు నిర్వహించాలి

  • అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ నిఖిల

జనగామ క్రైం, సెప్టెంబర్‌ 19 : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్‌లో ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోపు సదరం క్యాంపులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిఖిల మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంబంధిత వైద్యాధికారులు సదరం క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి జిల్లాలోని దివ్యాంగులు తొలుత మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌లో నిర్ణయించిన తేదీల ప్రకారం సదరం క్యాంపునకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతోపాటు ఆ రోజు వైద్యాధికారులు విధుల్లో ఉండేలా చూడాలని సదరం కమిటీ సభ్యులకు నిఖిల సూచించారు.

క్యాంపును నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మహేందర్‌, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో రమాదేవి, డీడబ్ల్యూవో జ్యోతి, డీఈవో యాదయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌యాదవ్‌, జిల్లా ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ చంద్రమౌళి, ఎన్జీవో బజాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo