గురువారం 04 మార్చి 2021
Jangaon - Sep 19, 2020 , 06:03:50

వెంకిర్యాలలో కరోనా పరీక్షలు

వెంకిర్యాలలో కరోనా పరీక్షలు

జనగామ రూరల్‌, సెప్టెంబర్‌18: మండలంలోని వెంకిర్యాల గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 35 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వారికి మందులు అందించారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్‌ ఆఫీసర్‌ అబ్బు మధుకర్‌ యాదవ్‌, సర్పంచ్‌ కీర్తి లక్ష్మీనర్సయ్య, ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉదయ్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 

VIDEOS

logo