శనివారం 31 అక్టోబర్ 2020
Jangaon - Sep 16, 2020 , 04:39:24

కుంటకు గండిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

కుంటకు గండిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

  • జడ్పీ చైర్మన్‌కు ముదిరాజ్‌ సంఘం నేతల వినతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 15: మండంలోని తాటికొండ గ్రామ శివారులోని పోలకమ్మకుంటకు గండి పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య సంబంధిత అధికారులను కోరారు. ఈ విషయమై మంగళవారం జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డికి ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం నీల గట్టయ్య మాట్లాడుతూ పోలకమ్మకుంటకు తాటికొండ గ్రామానికి చెందిన అక్కినపల్లి బాలరాజు, బండ అశోక్‌, బండ సంపత్‌, లింగయ్య గండిపెట్టి ముదిరాజ్‌లకు నష్టం కలిగించారని ఆరోపించారు. ఇక్కడ డెయిరీ ఫామ్‌ ఏర్పాటుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కుంటకు గండితో నీరంతా వృథా అయ్యిందని, చేపలు పెంచడానికి వీలులేకుండా పోయిందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య సొసైటీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా డైరెక్టర్‌ నీల రవి, సొసైటీ చైర్మన్‌ మిరుదొడ్డి మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు నీల వెంకటనర్సు, డైరెక్టర్లు యాదగిరి, పెరుమాండ్లు, రొయ్యల కనకయ్య, నల ్లకొమురయ్య, నాయకులు బోయిని ఎల్లయ్య, చొక్కం రాములు, పండుగ రవి, ఎస్‌. యాకయ్య, గుర్రపు భిక్షపతి, రవి, ఉప సర్పంచ్‌ మారపాక రాములు, వార్డు సభ్యులు ఎం. నాగరాజు, బోయిని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.