మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Sep 15, 2020 , 07:17:32

ఇంజినీర్ల నిర్లక్ష్యంతోనే పంట నష్టం

ఇంజినీర్ల నిర్లక్ష్యంతోనే పంట నష్టం

దేవరుప్పుల, సెప్టెంబర్‌ 14 : ఇంజినీర్ల నిర్లక్ష్యంతోనే మండలంలోని గొల్లపల్లిలో పంట నష్టం జరిగిందని పలువురు రైతులు ఆరోపించారు. సోమవారం ఎంపీటీసీ జకీర్‌, నాయకులు కోనేటి నర్సయ్య, రైతులు తీగల లక్ష్మయ్య, వేణు విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ బావులకు వెళ్లే పడమటి దారిలో కల్వర్టు నిర్మాణంలో లోపంతోనే పొలాల్లోకి వరదలొచ్చాయన్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షంతో సుమారు రూ.70 వేల విలువైన పంట నష్టం జరిగిందని వారు వివరించారు. దీనిపై పీఅర్‌ ఏఈ సతీశ్‌ను వివరణ కోరగా ఇంజినీరింగ్‌ ప్లాన్‌ ప్రకారమే కల్వర్టు నిర్మాణం జరిగిందని, భారీ వర్షాలు రావడంతో వరదలు పోటెత్తాయని అన్నారు. కల్వర్టును పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

VIDEOS

logo