మంగళవారం 27 అక్టోబర్ 2020
Jangaon - Sep 15, 2020 , 07:17:32

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

  • అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ నిఖిల

కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 14 : ప్రతి గ్రామంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ నిఖిల అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో అక్ర మ లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు. అక్రమ లేఅవుట్‌లుంటే వాటిని గుర్తించి నిర్ణీత నమూనాలో నివేదికను పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎండీ అబ్దుల్‌ హమీద్‌, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి  పాల్గొన్నారు. 

రిజర్వాయర్లకు భూసేకరణపై సమీక్ష

జిల్లాలో దేవాదుల రిజర్వాయర్లకు భూసేకరణపై అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సం బంధిత అధికారులతో మాట్లాడారు. జలాశయాలతోపాటు కాల్వల తవ్వకానికి అవసరమైన భూముల సేకరణపై జనగామ ఆర్డీవో మధుమోహన్‌తో చర్చించారు. భూసేకరణలో ముంపు బాధితులకు ఇవ్వాల్సిన పరిహారంపై వివరాలు తెలుసుకున్నారు. 
logo