మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Sep 15, 2020 , 07:17:32

దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు

దాడికి పాల్పడిన  ఆరుగురిపై కేసు నమోదు

జనగామ క్రైం, సెప్టెంబర్‌ 14 : జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో సోమవారం ఒకరితో గొడవపడి దాడికి పాల్పడిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు జనగామ అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసముంటున్న అల్వాల రవికుమార్‌ సోమవారం అదే ఏరియాలోని ఓ చెట్టు కొమ్మలను కొడుతున్న సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన మింటూ, బబ్బూ, నవీన్‌, జితేందర్‌, సుశాంత్‌, సురేశ్‌ అడ్డుకున్నారు. ఈ క్రమంలో రవికుమార్‌తో వీరు ఘర్షణపడి దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు రవికుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పై ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్‌యాదవ్‌ పేర్కొన్నారు.
VIDEOS

తాజావార్తలు


logo