శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Sep 09, 2020 , 02:42:53

అధైర్యపడకండి.. అండగా ఉంటా..

అధైర్యపడకండి.. అండగా ఉంటా..

  • కరోనా బాధితులకు మంత్రి ఎర్రబెల్లి భరోసా 
  • హోం క్వారంటైన్‌ ఉన్న వారికి ఫోన్‌లో పరామర్శ

పాలకుర్తి రూరల్‌: అధైర్యపడకండి.. మీకు అండగా ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారితో ప్రతి రోజూ మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి నియోజకవర్గంలోని

కరోనా బాధితులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా బాధితులు ఆందోళన చెందొద్దన్నారు. పాలకుర్తి, తొర్రూరు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

గ్రామ, మండల కమిటీల ద్వారా కరోనా బాధితుల్లో ధైర్యాన్ని నింపాలని సూచించారు. కరోనా తీవ్రత తగ్గిందన్నారు. పోలీసులు, వైద్యులు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, జిల్లా మండల వైద్యాధికారులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo