శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Sep 02, 2020 , 02:48:38

ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరనిలోటు

ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరనిలోటు

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌, సెప్టెంబర్‌ 1: రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ దేశానికి అందించిన సేవలు మరువలేవని, ఆయన మృతి తీరని లోటని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రణబ్‌ముఖర్జీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. రాజయ్య మాట్లాడుతూ అపర చాణక్యుడు, మేధావి ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, ఎంపీటీసీలు ఎస్‌ దయాకర్‌, మునిగెల రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, జిల్లా నాయకులు అక్కినపల్లి బాలరాజు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ తోట సత్యం, ఏఎంసీ డైరెక్టర్‌ గట్టు మనోహర్‌బాబు, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు మారెపల్లి ప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు గుండె మల్లేశం, నాయకులు గోనెల ఉప్పలయ్య, చట్ల రాజు, గట్టు వెంకటస్వామి, రమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

దేవరుప్పులలో..

దేవరుప్పుల : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. మంగళవారం స్థానిక తహసిల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ స్వప్న ప్రణబ్‌ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. ప్రణబ్‌ ముఖర్జీ తన హయాంలో దేశప్రతిష్టను ఇనుమడింపజేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ రవీందర్‌రెడ్డి, ఉద్యోగులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

రఘునాథపల్లిలో..

రఘునాథపల్లి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతికి కంచనపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ చీమలపాటి రవీందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్‌ నివాళులర్పించారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు ప్రణబ్‌ముఖర్జీ దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందించిన సహకారాన్ని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల నరేందర్‌, నాయకులు గుగులోతు కొమురెళ్లి, ఇబ్రహీం, పేర్ని రవి, కడారి చిన్న నగేశ్‌, వీరస్వామి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : మండలంలోని కొన్నె గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రణబ్‌ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వం చ వెంకట్‌రెడ్డి, నాయకులు గనిగౌడ్‌, నర్సింహారెడ్డి, అనిల్‌, రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo