మంగళవారం 20 అక్టోబర్ 2020
Jangaon - Sep 01, 2020 , 05:17:28

ప్రతిఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలి

ప్రతిఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలి

  • అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

బచ్చన్నపేట, ఆగస్టు 31 : ఆలింపూర్‌లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నందున ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. సోమవారం ఆయన మండలంలోని ఆలింపూర్‌ గ్రామాన్ని స్థానిక సర్పంచ్‌ నరెడ్ల బాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కరోనా బాధితుల ఇళ్లకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇచ్చారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వైద్యులు ఇచ్చిన మందులను సకాలంలో వినియోగించడంతోపాటు మాస్కులను ధరించాలన్నారు. కరోనాపై భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అవగాహనతో ఉంటే సరిపోతుందన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, వేడి చేసిన నీటినే తాగాలని భాస్కర్‌రావు కోరారు. బెల్టుషాపులను మూసి వేయాలని, దీనిపై పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మహేందర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో లగిశెట్టి అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, నర్మెట సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై రఘుపతి, మండల వైద్యాధికారులు ఆశాదేవి, నవీన్‌కుమార్‌, ఆర్‌ఐ ఆంధ్రయ్య, వీఆర్‌వో కనకరాజు, పం చాయతీ కార్యదర్శి రేవతి పాల్గొన్నారు. 


logo