శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 31, 2020 , 03:45:27

సంక్షేమం@తెలంగాణ‌

సంక్షేమం@తెలంగాణ‌

  •  పథకాలకు కేరాఫ్‌  మన రాష్ట్రం
  • అన్ని కులాలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
  •  ప్రతి గామంలో తాటి,   ఈత వనాలు
  •  జనగామ జిల్లా పర్యటనలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌
  •  బొమ్మకూరు రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల
  •  నవాబుపేటలో మొక్కలు నాటిన మంత్రి
  •  మండలగూడెంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ

సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్‌గా నిలుస్తున్నదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నారని ఆయన చెప్పారు. ఆదివారం జనగామ జిల్లాలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యతో కలిసి పర్యటించారు. నర్మెట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలారు. హరితహారంలో భాగంగా లింగాలఘనపురం మండలం నవాబుపేటలో ఖర్జూర, ఈత మొక్కలు నాటారు. రఘునాథపల్లి మండలం మండలగూడెంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.


సంక్షేమం@తెలంగాణ
తరిగొప్పుల(నర్మెట)/ రఘునాథపల్లి/ లింగాలఘనపు రం, ఆగస్టు 30 : తెలంగాణలోని  అన్ని కులాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నర్మెట మండలంలోని బొమ్మకూర్‌ రిజర్వాయర్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో కలిసి ఆదివారం చేప పిల్లలు వదిలారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వందశాతం  ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చేపలతో ముదిరాజ్‌లు, గొర్రెలతో గొల్లకుర్మలు, తాటి వనాలతో గీత కార్మికులు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు వినియోగించుకుంటున్న ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం రఘునాథపల్లి మండలంలోని మండలగూడెంలో ఏర్పాటు చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అణగారిన వర్గాల తరఫున పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన వీరత్వానికి గుర్తుగా లండన్‌ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సర్వాయి పాపన్న తెలంగాణ ప్రాంతంలోని ఖిలాషాపురానికి చెందిన వాడని తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ పేర్వారం జగన్నా థం తన పీహెచ్‌డీ సమయంలో గుర్తించారని అన్నారు. గత పాలకులు పాపన్న చరిత్రను విస్మరిస్తే, సీఎం కేసీఆర్‌ జఫర్‌ఘడ్‌, రఘునాథపల్లిలో  పాపన్న నిర్మించిన కోటలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించారని తెలిపారు. అంతకు ముందు పాపన్న విగ్రహం ఎదుట మొక్కలు నాటగా సర్పంచ్‌ ఉత్తెపు ఉమరాణి-సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి లింగాలఘనపురంలోని నవాబుపేట గ్రామంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఖర్జూర, ఈత మొక్కలు నాటా రు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 
చిన్నజిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందన్నారు. తాటి, ఈత, ఖర్జూర వనాలతో గీత కార్మికులకు ఉపాధి  అవకాశాలు పెంచుతున్నామన్నారు. కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ హరితహారంలో 52 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, లక్ష్యానికి మించి నాటామన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. కల్లులో ఔషధ గుణాలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీలు చిట్ల జయశ్రీ, తెజావత్‌ గోవర్దన్‌, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు గౌస్‌, మాలోత్‌ శ్రీనివాస్‌, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దూసరి గణపతి, విండో చైర్మన్‌ బుషిగంపల ఉపేందర్‌, జిల్లా నాయకుడు పెద్దిరాజిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బుస మల్లేశం, ఉపాధ్యక్షుడు చింతల యాదగిరి, జనగామ జిల్లా ముదిరాజ్‌ మహాసభ ప్రధాన కార్యదర్శి కట్లసందానం దం, ప్రచార కార్యదర్శి ఇట్టబోయిన రమే శ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరటిసుధాకర్‌,శంకర్‌నాయక్‌, నర్సింహులు, నరహరి, తహసీల్దార్‌ మురళీధర్‌రావు, మత్స్యశాఖ అధికారులు పిల్లి శ్రీపతి, వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ గుగులోత్‌ రంగమ్మ, తహసీల్దార్‌ బన్సీలాల్‌, గౌడ సంఘం జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్‌గౌడ్‌, గౌడ సంఘం నాయకులు బాలరాజ్‌గౌడ్‌, రమణ, వెంకటమల్లు, శ్రీనివాస్‌ లు, కత్తి వెంకట స్వామి, వెంకన్న, సర్పంచ్‌ బూడిద జయరాజేశ్వర్‌గౌడ్‌, ఎంపీటీసీ తీగల సిద్దూగౌడ్‌, నాయకులు బోయిని రాజు, ఉడుగుల భాగ్యలక్ష్మి, ముత్తినేని ఉపేందర్‌, ఎక్సైజ్‌ డీసీ సురేశ్‌రాథోడ్‌, ఈఎస్‌ మహిపాల్‌రెడ్డి,  సీఐలు బ్రహ్మానందరెడ్డి, నాగేశ్వర్‌రావు, డీటీఎఫ్‌ సరిత, సుధీర్‌, ఐబీ డీఈ వెంకటకృష్ణారావు, జేఈ సునీల్‌ పాల్గొన్నారు.  
గుడుంబా తయారీని నిర్మూలించాలి
జనగామ క్రైం: గుడుంబా తయారీ, విక్రయాలను నిర్మూలించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.   గుడుంబా రహిత గ్రామాలుగా మార్చాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామం, తండాలో గుడుంబా ను నిర్మూలించాలన్నారు. గుడుంబా విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉమ్మ డి వరంగల్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేశ్‌ రాథోడ్‌, జనగామ జిల్లా  సూపరింటెండెంట్‌ మహిపాల్‌ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

VIDEOS

logo