మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Aug 30, 2020 , 03:19:11

కులమతాలకతీతంగా..

కులమతాలకతీతంగా..

జనగామరూరల్‌, ఆగస్టు 29 : మత సామరస్యానికి నిదర్శ నం సిద్దెంకి గ్రామం అనడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఈ దృశ్యమే నిదర్శనం.  ఒకే రోజు ప్రారంభ మైన గణపతి, మొహర్రం పండుగల సందర్భంగా గ్రామం లోని ఓ కాలనీలో ఒకవైపు గణపతి విగ్రహా న్ని ప్రతిష్ఠించారు. మరోవైపు పీరీల (ఆషుర్‌ఖానా)ను నిలబెట్టారు. ఇక్కడికి వచ్చే హిందూ, ముస్లిం భక్తులు పండుగ ను ఆనందంగా జరుపుకుం టున్నారు. ఒకే నెలలో, ఒకే రోజు రెండు పండుగలు ప్రారంభం కావడం వాటిని గ్రామస్తులంతా కలిసి మెలిసి జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. 

VIDEOS

logo